తూ.గో జిల్లాలో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం హెచ్చరించింది. రాబోయే 14 గంటల్లో ఉరుములు, పిడుగులు, గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వ్యవసాయదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.