శంఖవరం మండలం కత్తిపూడిలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. అనంతరం పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతినెల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక, తెల్లవారకముందే మీ ఇంటి ముందుకు పెన్షన్ పంపిణీ జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఎమ్మెల్యే సత్యప్రభ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.