ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు శనివారం పర్యటించారు. గ్రామంలో వైసీపీ కార్యకర్తలను అభిమానులను పెద్దలను ఆత్మీయంగా పలకరించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు దేవాలయాలు పూజలు జరిపి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.