పెదపూడి: 531 మంది విద్యార్థులకు తల్లికి వందనం

60చూసినవారు
పెదపూడి: 531 మంది విద్యార్థులకు తల్లికి వందనం
పెదపూడి మండలంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా 531 మంది విద్యార్థులకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి ఆదివారం వివరాలను తెలిపారు. మండలంలోని 18 గ్రామాల్లోని 20 సచివాలయాల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. అయితే పలు కారణాల వల్ల 213 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయన్నారు. సరైన వివరాలు సమర్పిస్తే వారికి మరో అవకాశం ఇస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్