ప్రత్తిపాడు: ఈతకు వెళ్లి గల్లంతయిన బాలుని మృతదేహం లభ్యం

68చూసినవారు
ప్రత్తిపాడు: ఈతకు వెళ్లి గల్లంతయిన బాలుని మృతదేహం లభ్యం
పెదశంకర్లపూడిలో ఏలేరు ఎడమ కాలువలో గ్రామానికి చెందిన పంది వీర వెంకట సత్యనారాయణ విఘ్నేష్ (15) సహచరులతో ఈతకు వెళ్లి మంగళ వారం గల్లంతవ్వగా మృతదేహం బుధవారం గుర్తించారు. దాదాపు 18 గంటల పాటు శ్రమించి కాలువలో మునిగిన ప్రదేశానికి దగ్గరలోనే గ్రామస్థులు విఘ్నేష్ మృతదేహాన్ని వెలికితీశారు. శవపరీక్ష అనంతరం పోలీసులు బంధువులకు అప్పగించారు. ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్