సంక్రాంతిని ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం అన్నారు. పండుగ పురస్కరించుకొని మరి ముఖ్యంగా యువత అసాంఘిక కార్యక్రమాలు పేకాట గుండాట, కోడిపందేలు వంటి జూదాలకు దూరంగా ఉండాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. యువత చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని శుక్రవారం మీడియాతో ఎస్ఐ తెలియజేశారు.