రౌతులపూడి మండలం దిగువ శివాడ గ్రామంలో 'సుపరిపాలనలో తొలిఅడుగు' పేరిట స్థానిక టీడీపీ శ్రేణులు శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్యే కరపత్రాలు పంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గ్రామస్థులకు వివరించారు.