ప్రత్తిపాడు: మహిళా సమాఖ్య పొదుపు సొమ్ములు మాయం

60చూసినవారు
ప్రత్తిపాడు: మహిళా సమాఖ్య పొదుపు సొమ్ములు మాయం
ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి గ్రామంలో డ్వాక్రా మహిళలకు చెందిన పొదుపు సొమ్ము బ్యాంకు నుంచి మాయం కావడంతో సభ్యులు సర్వత్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘానికి చెందిన మహిళలు ప్రతినెల చేసే పొదుపు సొమ్ము 2 లక్షల 40 వేల రూపాయలు బ్యాంకు నుంచి మాయం అయినట్లు డ్వాక్రా సమాఖ్య సెక్రటరీ గుర్తించటంతో విషయం వెలుగు చూసింది. ఈ ఘటనపై చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్