శంఖవరం మండలంలోని అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్ వాస్తవ్యులు కుంచపూడి సుధారాణి తన తండ్రి జ్ఞాపకార్థం రూ. 1, 00, 400 విరాళం ఇచ్చారు. తొలుత దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అధికారులకు అందజేశారు.