తూర్పుగోదావరి జిల్లా గోకవరం డిపో నుండి ఈనెల 9 నుండి 13 వరకు అరుణాచలంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని డిపో మేనేజర్ సుచరిత మార్గరేట్ శనివారం తెలిపారు. ఈ బస్సు విజయవాడ, శ్రీకాళహస్తి, తిరుపతి, విష్ణు కంచి, శివ కంచి మీదుగా అరుణాచలానికి చేరుకుంటుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ సర్వీసు టికెట్ ధర ₹4600 కాగా, రిజర్వేషన్ ముందుగానే చేసుకోవాలని సూచించారు.