టెన్త్ సప్లీ ఫలితాలు.. 10వ స్థానంలో తూ.గో జిల్లా

50చూసినవారు
టెన్త్ సప్లీ ఫలితాలు.. 10వ స్థానంలో తూ.గో జిల్లా
10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి 3,057 మంది పరీక్ష రాయగా, 2,537 మంది ఉత్తీర్ణత సాధించి 82.99 శాతం పాసయ్యారు. జిల్లా రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. 1,823 మంది బాలుల్లో 1,525 మంది, 1,234 మంది బాలికల్లో 1,012 మంది ఉత్తీర్ణులయ్యారు. జూన్ 13 నుంచి 19 వరకు రీకౌంటింగ్ (రూ.500), రీవెరిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్