శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన రౌతు శివ ఇంట్లో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీ చేశారు. వారు రూ.50 వేల నగదు, నాలుగు కాసుల బంగారం, 150 తులాల వెండి అపహరించినట్టు శివ తెలిపారు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహారిబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.