తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు దంచి కొడుతున్నాయి. జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం, రాజానగరం, కొవ్వూరు తదితర నియోజకవర్గాలలో సోమవారం భానుడు తన ప్రతాపం చూపాడు. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె ప్రవేశించినా ఎండలు మండిపోతూనే ఉన్నాయని ప్రజలు అంటున్నారు. భానుడి ఉగ్రతకు రహదారులు నిర్మానుష్యంగా మారాయి.