పత్తిపాడు మండలం గజ్జనపూడిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి వందరోజులు అయిన సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం ఎన్డీఏ శ్రేణులు అధికారులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించి ఇంటింటా తిరిగి సిక్టర్లను అంటించారు. స్థానిక సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె మీడియాకు తెలిపారు.