ఏలేశ్వరం మండలంలోని అవంతి ఫ్యాక్టరీలో మూడు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకు గురయ్యిన కార్మికులను సోమవారం డీఎంహెచ్వో నరసింహ నాయక్ పరామర్శించారు. పరిశ్రమలో బాధ్యతారహితంగా వ్యవహరించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని డీఎమ్అండ్ హెచ్వో హెచ్చారించారు. ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది జగ్గంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఆరోగ్య పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.