కావుడా రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం. సత్యనారాయణ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏలేశ్వరం, సమీప గ్రామాలను కలిపి 43. 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్లాను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ ప్రతిపాదిత ప్లాన్ వివరాలను లింగంపర్తి, తిరుమాలి, సి. రాయవరం, రమణయ్యపేట గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారన్నారు.