ఏలేశ్వరం: రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేత

52చూసినవారు
ఏలేశ్వరం: రేపు ఈ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేత
ఏలేశ్వరం విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో గొంటువానిపాలెం సీపీడబ్ల్యూఎస్ ఫీడర్ల పరిధిలో చెట్లకొమ్మలను తొలగించే పనులను ఏప్రిల్ 13న ఆదివారం చేపట్టనున్న కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని కార్యనిర్వాహక ఇంజినీర్ బి. వీరభద్రరావు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఏలేశ్వరం పరిధిలో చైతన్యనగర్, క్వారీపేట, మండలంలోని రమణయ్యపేట, సి. రాయవరం, జె. అన్నవరం గ్రామాలకు సరఫరా నిలిపివేస్తామని వివరించారు.

సంబంధిత పోస్ట్