రాజమండ్రి: విజేతలకు రూ.50 వేలు ప్రైజ్ మనీ

54చూసినవారు
రాజమండ్రి: విజేతలకు రూ.50 వేలు ప్రైజ్ మనీ
'యోగాంధ్ర' కార్యక్రమాన్ని పురస్కరించుకొని కవితలు, పాటలు, డాక్యుమెంటేషన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజమండ్రిలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు గురువారం తెలిపారు. విజేతలకు రూ.50,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు జూలై 13లోపు జిల్లా విద్యాశాఖ అధికారికి దరఖాస్తు చేయాలని, జూలై 14న రాష్ట్రానికి పంపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్