228 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు

81చూసినవారు
228 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు
గోదావరి నదికి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో రాజమండ్రి నగరంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాలైన బ్రిడ్జిలంక, కేదారి వారిలంక, వెదురు లంకలకు చెందిన 228 మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఆమె బుధవారం రాత్రి రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. వారిని రాజమండ్రిలోని రెండు పునరావాస కేంద్రాలకు తరలించి ఆహరం పంపిణీ చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్