కడియంలో వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి

71చూసినవారు
కడియంలో వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి
కడియం మండలం పొట్టిలంక 216(ఏ) నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలై చికిత్స పొందుతూ మృతిచెందినట్లు కడియం సీఐ బి. తులసీధర్ తెలిపారు. ఈ నెల 8న సుమారు 60 ఏళ్లు వయసు గల గుర్తుతెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. 108 అంబులెన్స్ లో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్