కంటైనర్ ఢీకొని రాజమండ్రి వాసి దుర్మరణం

73చూసినవారు
కంటైనర్ ఢీకొని రాజమండ్రి వాసి దుర్మరణం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంట్లపాడులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజమండ్రికి చెందిన షేక్ జానీ(40) మృతి చెందాడని ఎస్సై శ్రీరామ్ తెలిపారు. ఐదేళ్ల క్రితం వలస వచ్చి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ రొయ్యల పరిశ్రమంలో కూలీగా పని చేస్తున్నాడన్నారు. రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టడంతో అదే వాహనం ముందు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్