కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ

65చూసినవారు
కేసుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ
పెండింగ్, విచారణ దశలో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తూ. గో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో నెలవారీ నేర సమీక్షను రాజమండ్రి నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, పాత నేరస్థులపై నిఘా ఉంచడంతోపాటు పెట్రోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్