రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో రూసా నిధులతో నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టుల కోసం భౌతిక, భూవిజ్ఞానశాస్త్రం విభాగాలలో ఒక్కొక్కరి చొప్పున ప్రాజెక్టు ఫెలోల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. రామచంద్ర రావు బుధవారం తెలిపారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు తమ దరఖా స్తులను ఆగస్టు 5వ తేదీలోగా ఆన్లైన్లో దాఖలు చేయాలన్నారు. వివరాలకు కళాశాల వెబ్ సైట్లో సందర్శించాలని కోరారు.