ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఏలూరు, ఎన్టీఆర్, ఉమ్మడి ఉ.గో, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు పొలాల్లో, చెట్ల కింద ఉండరాదన్నారు.