ఈవీఎం ట్యాంపరింగ్ గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించడం, రాష్ట్రంలో కూడా తమకు అనుమానాలున్నాయని వైసీపీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారన్నారు. దాన్ని వైసీపీ హుందాగా స్వీకరించాలని సూచించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, తదితరులు పాల్గొన్నారు.