సీతానగరం మండలం చిన్నపూడి కొండేపూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు పలువురు సోమవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి వారిని జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. శ్రీకాంత్, నరేష్, రాకేష్, మధు, చాపల బుజ్జి, రామకృష్ణ, అఖిల్, వంశీ, అన్వేష్, జొన్నకూటి శాండీ, జొన్నకుటి గణేష్, చిడీపీ లక్షణ్, దినేష్, వరిగేటి రాజేష్, దాదాపు 36 మంది జనసేన పార్టీలోకి చేరారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు చెప్పారు.