రాజమండ్రిలో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్‌ను కలెక్టర్ ప్రశాంతి సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రతినెల ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్ తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. గోడౌన్ భద్రతకు సంబంధించిన వివరాలను అక్కడ అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.