రాజమండ్రి నగరం ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో ఆర్ఎంసి అధికారులు మంగళవారం సిసి రోడ్ నిర్మాణం చేపట్టారు. హెచ్ డి ఫ్ సి బ్యాంక్ ఎదురుగా ఉన్న వీధి నుంచి శ్రీ చక్రధారి రెసిడెన్సి, విశ్వతేజ జిరాక్స్ సెంటర్, జవహర్ లాల్ నెహ్రూ రోడ్డు వరకు 550 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. దీంతో ఆ కాలనీ ప్రాంత వాసులు చాలా సంవత్సరాల నుంచి పడ్డ సమస్య తీరిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.