ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పరిరక్షణే సీపీఐ లక్ష్యం

72చూసినవారు
ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పరిరక్షణే సీపీఐ లక్ష్యం
ఈ నెల 20వ తేదీన ది ఆర్యాపురం కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ బ్యాంకు పరిరక్షణ లక్ష్యంగా సీపీఐ పనిచేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. బుధవారం రాజమండ్రిలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా ఆర్యాపురం బ్యాంకులో ఎన్నికలు జరగక పారదర్శకత లోపించిందన్నారు. బ్యాంకు మీద అవగాహన లేని వ్యక్తులు బ్యాంకును పాలించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్