వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలని రాజమండ్రికి చెందిన సత్య చారిటబుల్ ట్రస్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ బుధవారం ఓ ప్రకటనలో కోరింది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని మోరంపూడి సెంటర్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న టీ టైమ్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను అందజేస్తున్నట్టు వారు తెలియజేశారు.