తూర్పు గోదావరి జిల్లాలో 2, 44, 302 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ కోసం 4, 092 మంది సిబ్బందిని సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం రాజమండ్రిలో ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 2, 44, 302 మందికి రూ. 165 కోట్ల 13 లక్షల 29 వేల ఐదు వందల ను పంపిణీ చేసేందుకు శనివారం బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ చేసినట్లు తెలిపారు.