రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను తూ. గో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్ & స్టేషన్లో గల వివిధ రికార్డులను పరిశీలించి నమోదైన కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్ల లోగల సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు.