అంబేద్కర్ గొప్ప మేధావి, రాజ్యాంగ నిర్మాత అని రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా సోమవారం రాజమండ్రి మున్సిపల్ ఆఫీస్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ మానవతావాది, గొప్ప మేధావి అని ఆయన సేవలు కొనియాడారు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.