నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2023- 24 సంవత్సరం రబీ ధాన్యం బకాయిలను విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలనిరాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి జమలయ్యశనివారం రాజమండ్రిలో డిమాండ్ చేసారు.జులై 1,2,3 తేదీలలో మండల కేంద్రాల్లో రైతులు చేత అర్జీలు ఇప్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు.రైతులు, కౌవులు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్న 20 వేల రూపాయలను వెంటనే రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.