ఆరోగ్యానికి భరోసా కల్పించాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

53చూసినవారు
ఆరోగ్యానికి భరోసా కల్పించాలి: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
రాజమండ్రిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కొరకు వచ్చే పేద ప్రజలందరికీ సకాలంలో వైద్య సేవలు అందించి వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వైద్యులకు సూచించారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి సందర్శించి మాట్లాడారు. ఆసుపత్రికి వైద్యం నిమిత్తం వచ్చిన ఏ రోగిని కూడా నిర్లక్ష్యం చేయకుండా వారికి వచ్చిన వెంటనే సకాలంలో వైద్యం అందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్