రాజమండ్రి నగరంలో గురువారం ఉదయం నుంచి ఎండ అధికంగా కాసింది. కానీ మధ్యాహ్నం అయ్యే సరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు మాత్రం ఈ వాతావరణంలో మార్పులకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.