రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో వివిధ కోర్సుల్లో చేరేందుకు ఆగస్టు 10 వరకు ప్రవేశాలకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ ఎం. నాగమణి బుధవారం తెలిపారు. జులై ఒకటో తేదీ నాటికి పదేళ్లు పైబడినవారు సర్టిఫికెట్ కోర్సు, 15 ఏళ్లు నిండి, సర్టిఫికెట్ కోర్సులో ఉత్తీర్ణులైనవారు డిప్లమా కోర్సులో చేరేందుకు అర్హులన్నారు. ఇతర వివరాలకు పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.