రేపు రాజమండ్రిలో జాబ్ మేళా

79చూసినవారు
రేపు రాజమండ్రిలో జాబ్ మేళా
రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 3న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరావు గురువారం తెలిపారు. తమ కళాశాలలో ఏదైనా డిగ్రీ, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన విద్యార్థులకు 8 బహుళజాతి సంస్థలకు చెందిన ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు తమ అర్హత ఒరిజినల్ & జిరాక్సు కాపీలతో, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరు కావచ్చునని తెలిపారు.

సంబంధిత పోస్ట్