రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ప్రకాష్ బాబు మాట్లాడుతూ వయసుపైబడిన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారికి పిల్లల నుంచి ఇబ్బందులు కలిగితే న్యాయ సేవాధికార సంస్థకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.