కడియం: అపర భగీరధుడు కాటన్ దొర

51చూసినవారు
కడియం: అపర భగీరధుడు కాటన్ దొర
కడియం మండలం దుళ్లలో అపర భగీరధుడు సర్ ఆర్ధర్ కాటన్ 222వ జయంతి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. గ్రామానికి చెందిన ఉత్తమ రైతు అవార్డు గ్రహీత సత్తి భాస్కర్ రెడ్డి (కందరెడ్డి) ప్రతి ఏటా కాటన్ జయంతి వేడుకలను ఒక ఉత్సవంలా జరుపుతారు. ఈ ఏడాది ఆయన వేదపండితులను పిలిచి పూజలు జరిపించారు. కాటన్ దొర ధవలేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించి అన్నదాతల పాలిట ఆపద్బాంధవుడై అపర భగీరధుడు అయ్యాడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్