కాకినాడ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలన్నిటిలో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాలను ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కోరారు. కాకినాడలో శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.