ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రంగరాయ వైద్య విద్యార్థులు స్వచ్ఛంద రక్తదానం చేశారు. కాకినాడ జిజిహెచ్ సర్జికల్ సెమినార్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సుమారు 58మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. లావణ్య కుమారి వైద్య విద్యార్థులతో వివక్షత లేకుండా రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని పేర్కొన్నారు.