కోరుకొండ మండలం కాపవరం గ్రామం సూర్య మహాలక్ష్మి రైస్ మిల్ దగ్గర కన్వర్టర్ బెల్ట్ తీసుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో ముగ్గురు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనకు సంబంధించి పూర్తి బాధ్యత వహించాలన్నారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా వైద్యులను డిమాండ్ చేశారు.