బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లను అరికడతాం: ఎమ్మెల్యే

81చూసినవారు
రాజమండ్రి నగరంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లను అరికడతామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాత్రి రాజమండ్రి నగరంలోని 13, 14 వార్డులలో నిర్వహించిన ‘మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై స్థానిక ప్రజలతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో శాంతిభద్రతలు మెరుగుపడతాయని నేరాలకు పాల్పడే వారిని శిక్షిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్