వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు అందరూ విరాళాలు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ఐదు లక్షల రూపాయల చెక్కును మంత్రి నారా లోకేష్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ తదితరులు ఉన్నారు.