రాజమండ్రిలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన శోభ సంతరించుకుంది. నగరంలోని దేవి చౌక్ మఠం వీధిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, నల్ల మందు సందు, వంకాయలు వారి వీధి తో పాటు పలు ప్రధాన వైష్ణవాలయాలు భక్తులతో శుక్రవారం కిటకిటలాడాయి. వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, కైంకర్యాలు నిర్వహించారు.