గత సంవత్సరం ఇదే రోజున రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా రాజమండ్రి నగరానికి వచ్చానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి శనివారం అన్నారు. స్థానిక జేఎన్ రోడ్డు పార్టీ కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధి ప్రజలు నన్ను దీవించి ఆప్యాయతల ఫలితంగా ఘనమైన విజయం సాధించానని అన్నారు. బీజేపీ పార్టీని నమ్ముకున్నందుకు తగిన గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.