రాజమండ్రిలో ఓ వ్యక్తి‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు

72చూసినవారు
రాజమండ్రిలో ఓ వ్యక్తి‌పై పీడీ యాక్ట్ కేసు నమోదు
రాజమండ్రి 3వ పట్టణ పోలీసులు వివిధ కేసులలో ప్రమేయం ఉన్న వ్యక్తిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. మట్టా వారి వీధిలో ఉంటున్న లావేటి ఉమా మహేశ్ పై శుక్రవారం పీడీ యాక్ట్ అమలు చేశామని సీఐ అప్పారావు తెలిపారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నగరంలో పలువురిపై నిఘా పెట్టామని సీఐ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్