విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల నేపథ్యంలో శుక్రవారం రాజమండ్రి నగరంలోని పలు ప్రాంతాలలో సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ గురువారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ బత్తిన నగర్, ఆల్వాల్ నగర్, ఇండస్ట్రియల్ ఏరియా, స్వరూప్ నగర్, సాయిదుర్గా నగర్, నారాయణపురం, సైక్లోన్ కాలనీ, గాదిరెడ్డి నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.