బీసీ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 52% ఉన్న బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 52% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీకు వినతి పత్రం అందచేశారు.